బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 19:31:17

నీవెంత అదృష్ట‌వంతుడివో.. కేటీఆర్‌కు క‌విత శుభాకాంక్ష‌లు

నీవెంత అదృష్ట‌వంతుడివో.. కేటీఆర్‌కు క‌విత శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : మ‌ంత్రి కేటీఆర్ పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని కేటీఆర్‌కు ఆయ‌న‌ సోద‌రి క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆమె స్పందిస్తూ... తోబుట్టువుల‌ను, ఇరుగుపొరుగువారిని మ‌నం ఎంచుకోలేం అంటుంటారు. నీ ముద్దుల చెల్లెల్ని అయినందుకు నువ్వెంత అదృష్ట‌వంతుడివో న‌మ్మ‌లేక‌పోతున్నా. అదేవిధంగా నీలాంటి రాక్ స్టార్ బ్ర‌ద‌ర్‌గా ఉండ‌టం ఎంతో గొప్ప విష‌య‌మ‌న్నారు. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అన్న‌య్యా అంటూ ఇరువురు క‌లిసి ఉన్న చిన్న‌నాటి ఫోటోను క‌విత‌ షేర్ చేశారు. 


logo