ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 20:00:48

'రోహింగ్యాలు వస్తే కేంద్రం ఏం చేస్తోంది?'

'రోహింగ్యాలు వస్తే కేంద్రం ఏం చేస్తోంది?'

హైదరాబాద్‌:  కరోనా సమయంలో పేదలను ఆదుకున్నామని, వరదలు వచ్చినప్పుడు కూడా టీఆర్‌ఎస్‌ నేతలే అండగా ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  ముషీరాబాద్‌లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొని మాట్లాడారు. 

'తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోదీ సర్కార్‌ ఎలాంటి సాయం చేయలేదు. ఒక్క ప్రాజెక్టుకైనా కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు. హైదరాబాద్‌లో  5.50లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌కు ఏం చేస్తారో బీజేపీ నేతలు చెప్పరు.  హైదరాబాద్‌కు రోహింగ్యాలు వస్తే కేంద్రం ఏం చేస్తోందని' విమర్శించారు.