శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:15:54

మాజీ ఎంపీ కవిత వితరణ

మాజీ ఎంపీ కవిత వితరణ

  • సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌కు తొమ్మిది కంప్యూటర్లు అందజేత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సికింద్రాబాద్‌లోని సెయింట్‌ జోసఫ్‌ సెకండరీ స్కూల్లో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ కోసం మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తొమ్మిది కంప్యూటర్లను అందించారు. ఈస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన బైలా గాబ్రియల్‌.. సెయింట్‌ జోసెఫ్‌ పేరుతో 27 ఏండ్లుగా పాఠశాల నిర్వహిస్తూ.. సమాజంలో అణగారినవర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు యాజమాన్యానికి కంప్యూటర్ల కొరత ఏర్పడింది. పాఠశాలకు ల్యాప్‌టాప్‌ లేదా, కంప్యూటర్లు అందించేందుకు దాతలు ముందుకురావాలని కోరుతూ మేరికా ఇసాబెల్‌ ట్వీట్‌ చేశారు. ట్వీట్‌పై స్పందించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.. తొమ్మిది కంప్యూటర్లు అందించేందుకు ముందుకొచ్చారు. శుక్రవారం తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్‌, ప్రధా న కార్యదర్శి నవీన్‌ఆచారి పాఠశాల యాజమాన్యానికి ఆ కంప్యూటర్లను అందించారు.  భవిష్యత్‌లో మరింత సహాయం చేస్తాననఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


logo