శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 17, 2020 , 15:58:04

అన్నయ్య..వదినకు హెయిర్‌ కట్‌ చేసే అవకాశం ఇస్తున్నావా?!

అన్నయ్య..వదినకు హెయిర్‌ కట్‌ చేసే అవకాశం ఇస్తున్నావా?!

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించడంతో  బ్యూటీపార్లర్లు, సెలూన్లు కూడా మూతపడటంతో కటింగ్, షేవింగ్ చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బందిగా మారింది. లాక్‌డౌన్‌ ఎత్తేసే వరకు ఇంకా ఎన్నిరోజులు పడుతుందో..హెయిర్ కటింగ్ చేసుకోకుండా ఇంకా ఎన్నిరోజులు ఉండాలనే దానిపై ఆందోళన చెందుతున్నారు. బార్బర్‌ షాపులు, సెలూన్లు ఎప్పుడెప్పుడు ఓపెన్‌ చేస్తారా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో శరత్‌ చంద్ర అనే వ్యక్తి ఏప్రిల్‌ 20 తర్వాత సెలూన్లు ఓపెన్‌ చేసే అవకాశం ఉందా అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.   లేకపోతే..తన భార్య హెయిర్‌ కట్‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని తెలిపాడు.  అదే జరిగితే, లాక్‌డౌన్ తర్వాత కూడా తాను ఇంటికి పరిమితం కావాల్సి వస్తుందని  సరదాగా వ్యాఖ్యానించాడు. దీనిపై కేటీఆర్‌ కూడా తమాషాగా బదులిచ్చారు. 

భారత క్రికెట్‌ కెప్టెన్‌  విరాట్ కోహ్లీనే తనకు హెయిర్ కట్‌ చేయడానికి తన భార్య అనుష్క శర్మకు అవకాశం ఇచ్చాడని గుర్తు చేశారు.  నువ్వెందుకు ఆ అవకాశం ఇవ్వకూడదూ? అని కేటీఆర్ బదులిస్తూ..నవ్వుతున్న ఎమోజీని జత చేశారు.  కేటీఆర్ ట్వీట్‌కు మాజీ ఎంపీ కవిత కూడా స్పందిస్తూ.. ‘అన్నయ్యా.. బాబీకి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా ?!  అని అడిగారు. ప్రస్తుతం ఈ సంభాషణపై నెటిజన్లు  ఆసక్తికరంగా కామెంట్లు చేస్తుండటంతో ట్విటర్‌లో వైరల్‌గా మారింది.
logo