శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 10:39:52

నాయిని మృతిప‌ట్ల హ‌రీష్ రావు, క‌విత సంతాపం

నాయిని మృతిప‌ట్ల హ‌రీష్ రావు, క‌విత సంతాపం

హైద‌రాబాద్ : ‌మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి మృతిప‌ట్ల మంత్రి హ‌రీష్ రావు, ఎమ్మెల్సీ క‌విత సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. 

కార్మిక పక్షపాతి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి మరణం బాధాకరమ‌ని క‌విత అన్నారు. తొలిదశ ఉద్యమం నుంచి నేటి వరకు రాష్ట్రం కోసం, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడిన వ్యక్తి ‌నర్సన్న. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని క‌విత ట్వీట్ చేశారు. 

తెలంగాణ మాజీమంత్రి నాయిని నర్శింహారెడ్డి మరణం అత్యంత బాధాకర‌మ‌ని హ‌రీష్ రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి, మలి దశ ఉద్య‌మాల్లో వారు చేసిన పోరాటం గొప్పది. కార్మికులు, పేదల పక్షపాతిగా వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తిత్వం నర్సన్నది. వారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది అని హ‌రీష్ రావు ట్వీట్ చేశారు.