గురువారం 28 మే 2020
Telangana - May 21, 2020 , 02:10:46

క్యాన్సర్‌ బాధితురాలికి మాజీ ఎంపీ కవిత చేయూత

క్యాన్సర్‌ బాధితురాలికి మాజీ ఎంపీ కవిత చేయూత

మయూరీసెంటర్‌ : ఖమ్మంనగరం జహీర్‌పుర ప్రాంతానికి చెందిన షేక్‌సైదమ్మ కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నది. లాక్‌డౌన్‌ కారణంగా మందులు దొరక్క ఇబ్బందులు పడుతున్న సైదమ్మ దీనస్థితిని ఆమె మనుమడు అబ్బాస్‌ ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో జాగృతి నాయకులకు చేరడంతో వారు ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. వీడియోను చూసిన మాజీ ఎంపీ కవిత తక్షణం స్పందించారు. మందులను హైదరాబాద్‌ నుంచి పంపి మంచి మనస్సును చాటుకున్నారు. వాటిని జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్‌ బుధవారం జిల్లా కన్వీనర్‌ ఆధ్వర్యంలో జాగృతి జిల్లా అధికార ప్రతినిధి గుంతేటి వసంతరావు, జిల్లా యువజన అధ్యక్షుడు వనం నాగేంద్రకుమార్‌, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్‌ మద్దాలి శిరీష్‌లు సైదమ్మకు అందజేశారు.logo