e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News డ‌బుల్ రోడ్ల మంజూరు చేయాల‌ని మంత్రి వేముల‌కు విన‌తి

డ‌బుల్ రోడ్ల మంజూరు చేయాల‌ని మంత్రి వేముల‌కు విన‌తి

డ‌బుల్ రోడ్ల మంజూరు చేయాల‌ని మంత్రి వేముల‌కు విన‌తి

హైద‌రాబాద్ : వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలంలోని తాండ్రియాల్ గ్రామం నుంచి గోవిందారం వరకు, కథలాపూర్ నుంచి చింతకుంట మీదుగా భూషణరావు పేటకు డబుల్ రోడ్లు మంజూరు చేయాలని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డికి విన‌తిప‌త్రం అందించారు.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నామనేని రమేష్ రాసిన లేఖను రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి మార్క్ ఫెడ్ మాజీ చైర్మ‌న్ లోక బాపు రెడ్డి, కథలాపూర్ మండలానికి సంబంధించిన స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు కలిసి అందజేశారు. ఈ రోడ్లు పూర్తి అయితే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది అని తెలిపారు. వారి ప్ర‌తిపాద‌న‌కు సానుకూలంగా స్పందించిన మంత్రి.. త్వరలో వీటి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తాన‌ని హామీ ఇచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జ‌డ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి గణేష్, ఎంపీటీసీలు బొడ్డు బాలు, గండ్ర కిరణ్ రావు, బాధినేని రమేష్, కొండ ఆంజనేయులు, గసికంటి లత వేణు, మ్యాధరి గంగా రాజం, సర్పంచ్‌లు ఎంజీ రెడ్డి, గడిల గంగా ప్రసాద్, గోపు శ్రీను, గజ్జెల స్వామి, గండ్ల వీణ స్వామి, పిడుగు లత తిరుపతి రెడ్డి, కొలి వసంత నరేందర్ రెడ్డి, దారవత్ సరోజ సీతారాం నాయక్, పోతు సింధూజ శేఖర్, ప్రతాప్, శేఖర్, గోపు శ్రీను, లావుడ్య సరిత రవి నాయక్, కో ఆప్షన్ సభ్యులు ఎండీ రఫీ, సింగిల్ విండో చైర్మ‌న్‌లు దాసరి గంగాధర్, చుక్క దేవరజం ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డ‌బుల్ రోడ్ల మంజూరు చేయాల‌ని మంత్రి వేముల‌కు విన‌తి
డ‌బుల్ రోడ్ల మంజూరు చేయాల‌ని మంత్రి వేముల‌కు విన‌తి
డ‌బుల్ రోడ్ల మంజూరు చేయాల‌ని మంత్రి వేముల‌కు విన‌తి

ట్రెండింగ్‌

Advertisement