సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 00:32:52

కార్వీకి హైకోర్టులో చుక్కెదురు

కార్వీకి హైకోర్టులో చుక్కెదురు

  • అక్రమాలపై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాపునకు అనుమతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌పై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. నిధుల మళ్లింపు ఆరోపణలపై సెబీ తుది నిర్ణయం రాకముందే తమపై కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ విచారణకు ఆదేశించిందని, సదరు విచారణను అడ్డుకోవడంతోపాటు ఎస్‌ఎఫ్‌ఐవో జారీ చేసిన నోటీసులను కొట్టేయాలని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది. బుధవారం తుది ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో కేంద్రం తరఫున ఏఎస్‌జీ రాజేశ్వర్‌రావు వాదిస్తున్నారు.logo