మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 19:53:46

ధర్మపురికి కార్తీక శోభ.. గోదావరికి గంగాహారతి..

ధర్మపురికి కార్తీక శోభ.. గోదావరికి గంగాహారతి..

ధర్మపురి :  దక్షణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం ఆరంభం సందర్భంగా తొలిరోజు సాయంత్రం గోదావరి నదికి గంగాహారతి నిర్వహించారు. వేద పండితుడు బొజ్జ రమేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు,  వేద బ్రాహ్మణులు, సిబ్బంది మంగళవాయిద్యాలు నడుమ గోదావరి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గోదావరి నదికి హారతి సమర్పించి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు నదిలో కార్తీక దీపాలు వదిలి భక్తి ప్రవత్తులు చాటుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, వేద పండితులు రమేశ్‌శర్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, ఆలయ ఉపప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, అభిషేక్‌ పురోహితులు బొజ్జ సంపత్‌కుమార్‌, తదితరులున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.