ఆదివారం 07 మార్చి 2021
Telangana - Dec 02, 2020 , 17:15:22

యాదాద్రిలో కార్తీక మాసం సందడి

యాదాద్రిలో కార్తీక మాసం సందడి

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఉదయం ఆరాధన బాలబోగం, పంచామృత అభిషేకం గావించి పట్టు వస్ర్తాలు ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేశారు. ఉదయం సుదర్శన నారసింహహోమం, గరుడ ఆంజనేయం, సుదర్శనం వంటి దేవతల మూలమత్రాలతో హవనం చేశారు. అలాగే సాయంకాలం వెండి జోడు సేవ, నిత్యకల్యాణంలో గరుడ సేవలు నిర్వహించారు. 

దేవస్థానం ఏర్పాటు చేసిన 108 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన గావించారు. కార్తీకమాసం సందర్భంగా స్వామివారి కొండపై గల వ్రత మండపం, పాతగుట్టలో నిర్వహించిన శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు మొక్కుపూజలు చేశారు. వేకువజామున్నే భక్తులు దీపారాధాన చేపట్టి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.


VIDEOS

logo