శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 19:02:29

యాదాద్రిలో కార్తీక మాస పూజలు

యాదాద్రిలో కార్తీక మాస పూజలు

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం కార్తీకమాస ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఉదయం ఆరాధన బాలబోగం, పంచామృత అభిషేకం గావించి పట్టు వస్ర్తాలు ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేశారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం సుదర్శన నారసింహహోమం, గరుడ ఆంజనేయం, సుదర్శనం వంటి దేవతల మూలమత్రాలతో హవనం చేశారు. అలాగే సాయంకాలం వెండి జోడు సేవ, నిత్యకల్యాణంలో గరుడ సేవలు నిర్వహించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన 108 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన గావించారు.