సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 01:37:48

అభివృద్ధికి అద్దం.. గవర్నర్‌ ప్రసంగం

అభివృద్ధికి అద్దం.. గవర్నర్‌ ప్రసంగం
  • ప్రభుత్వ విప్‌ కర్నె, ఎమ్మెల్సీ నారదాసు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ చేసిన ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి అద్దం పట్టిందని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. యావత్‌ దేశంలో తెలంగాణ నంబర్‌వన్‌ అనడానికి ఇదో ప్రతీకని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియాపాయింట్‌లో వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎంతో వివక్షకు గురైందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్నిరంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండటంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ విధానంతో రాష్ర్టానికి 2 వేలకుపైగా పరిశ్రమలొచ్చాయని, వాటిద్వారా 12 లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. 1.09 లక్షల కోట్ల ఎగుమతులతో ఐటీరంగం అద్భుతప్రగతి సాధిస్తున్నదని పేర్కొన్నారు. అభివృద్ధి జరిగితే ప్రతిపక్షాలు అభినందించాలేకానీ విమర్శించడం సరికాదన్నారు. 


ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి: ఎంఐఎం

ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానించినట్టుగానే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలోనూ తీర్మానం చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే సయ్యద్‌ పాషాఖాద్రి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తదితరులు సీఎం కేసీఆర్‌కు విజ్ఙప్తిచేశారు.


logo