సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 03:15:42

కాంగ్రెస్‌ది రాష్ర్టానికో విధానం

కాంగ్రెస్‌ది రాష్ర్టానికో విధానం

  • చలో రాజ్‌భవన్‌ హాస్యాస్పదం
  • విప్‌ కర్నె ప్రభాకర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్‌.. ఒక జాతీయ విధానం లేని పార్టీగా తయారైందని ప్రభు త్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. కరోనా సమయంలో కాంగ్రెస్‌ పార్టీ చలో రాజ్‌భవన్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కర్నె ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ర్టానికో విధానంతో రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని అసంబద్ధ డిమాండ్‌ చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు, రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తున్నారని రాజ్‌భవన్‌ను ముట్టడిస్తున్నారని ఇదేం నీతి అని నిలదీశారు. రాజస్థాన్‌లో ఒక విధానం, తెలంగాణలో మరొకటా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేర్పిన రాజకీయాన్ని నేడు దేశంలో బీజేపీ అమలుచేస్తున్నదని విమర్శించారు. అధికారంలో ఉండగా గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసిన కాంగ్రెస్‌, రాజ్‌భవన్‌ను ముట్టడించడం విడ్డూరంగా ఉన్నదన్నారు.


logo