ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 08, 2020 , 14:06:25

నారాయణపూర్‌ నుంచి దిగువకు నీటి విడుదల పెంపు

నారాయణపూర్‌ నుంచి దిగువకు నీటి విడుదల పెంపు

బెంగళూర్‌ : ఎగువ కురుస్తున్న వర్షాలకు కృష్ణానదితోపాటు ఉపనదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లాలోని నారాయణపూర్ డ్యాంకు భారీగా వరద వస్తుండడంతో వచ్చే నీటి కంటే దిగువకు ఎక్కువగా విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి నారాయణపూర్ జలాశయం నుంచి 1,87,678 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా శనివారం ఉదయానికి 2.2 లక్షల క్యూసెక్కులకు పెంచారు. భారీగా  వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రానున్న రెండురోజులు ఎగువ నుంచి వరద పోటెత్తే అవకాశం ఉండడంతో అధికారులు అన్నివిధాలా అప్రమత్తమవుతున్నారు. 


logo