ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Aug 03, 2020 , 00:11:15

హరితనగరంలా మార్చుదాం మంత్రి గంగుల కమలాకర్‌

హరితనగరంలా మార్చుదాం మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ను సుందర, హరితనగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. హరితహారంలో భాగంగా కరీంనగర్‌లోని గిద్దెపెరుమాండ్ల ఆలయ ఆవరణలో ఆదివారం మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. కరీంనగర్‌లో అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఈసారి 50 లక్షల మొక్కలు నాటుతున్నామన్నారు. నగరంలో 12 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించు కొన్నామనీ, బ్లాక్‌ ప్లాంటేషన్‌, మియావాకి పద్ధతి, ఎవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు.  


logo