ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 01:08:19

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్‌ బాధ్యతల స్వీకరణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్‌ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలిసి గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి పార్టీ కార్యాలయానికి వచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తనను అధ్యక్షుడిగా నియమించిన ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో ఎంపీలు అర్వింద్‌, సోయం బాపూరావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.


logo