కరీంనగర్ డైరీ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం

కరీంనగర్ : స్వచ్ఛత, నాణ్యత, పరిమాణంలో పాల ఉత్పత్తులను అందించడం ద్వారా తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకున్న కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూస్ కంపెనీ లిమిటెడ్ అకా కరీంనగర్ డైరీ ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల మార్కెట్లోకి అడుగుపెట్టింది. కరీంనగర్ పట్టణంలోని పద్మానగర్‌లో ఏర్పాటు చేసిన కరీంనగర్ డెయిరీ ఫిల్లింగ్ స్టేషన్‌ను రాష్ట్ర పౌరసరఫరాలు, సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు, కరీంనగర్ డైరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో విశాలమైన ప్రాంగణంలో ఈ అత్యాధునిక ఫిల్లింగ్ స్టేషన్‌ను నిర్మించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాల ఉత్పత్తుల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న విధంగానే నాణ్యమైన పెట్రోల్ ఉత్పత్తులను అందిస్తూ వాహనదారుల విశ్వాసాన్ని కరీంనగర్ డైరీ గెలుచుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు. రోజుకు 2 లక్షల లీటర్ల పాలు అమ్ముతూ తెలంగాణలోనే నంబర్ వన్ డెయిరీగా ఎదిగిన కరీంనగర్ డెయిరీని మంత్రి అభినందించారు. నాణ్యమైన ఉత్పత్తులు వినియోగదారులకు సంతృప్తిని ఇస్తాయన్నారు.
70 వేల మంది పాల ఉత్పత్తిదారులు, వారి కుటుంబ సభ్యుల కోసం అనేక వినూత్న సంక్షేమ పథకాలను ప్రారంభించినందుకు కరీంనగర్ డైయిరీని ప్రశంసించారు. బసుంది స్వీట్స్‌లో కరీంనగర్ డెయిరీ బ్రాండ్ లీడర్‌గా ఎదిగిందన్నారు. పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు, అదనపు ఆదాయన్ని అందించడం ద్వారా వ్యవసాయ సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఆదిపురుష్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్
- ఆయన సేవ.. మరొకరికి తోవ..