బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 16:05:06

వనాలకు చిరునామాగా కరీంనగర్ : మంత్రి గంగుల

వనాలకు చిరునామాగా కరీంనగర్ : మంత్రి గంగుల

కరీంనగర్ : రాబోయే కాలంలో వనాలకు చిరునామాగా కరీంనగర్ నిలుస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, చీఆఫ్ కన్జర్వేటర్ శోభతో కలిసి కరీంనగర్‌లోని పోలీసు శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. కేంద్రం మియావాకి పద్ధతిలో పెంచుతున్న చిట్టడవిని పరిశీలించారు. చీఫ్ కన్జర్వేటర్‌తోపాటు మంత్రి గంగుల పోలీసుల ప్రయత్నాన్ని అభినందించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పచ్చదనం తరిగి పోయి వాతావరణంలో సమతుల్యత లోపించడం వల్ల అనేక మార్పులు సంభవించాయని అన్నారు. భవిష్యత్ తరాలకు డబ్బు, ఆస్తులు అందించే కన్నా మంచి పర్యావరణాన్ని అందించడం మంచిదన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐడీ విభాగం ఐజీ ప్రమోద్‌కుమార్, కలెక్టర్ కే శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి, ఎంజే అక్బర్, నగర మేయర్ వై సునిల్ రావు తదితరులు పాల్గొన్నారు.


logo