సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 10, 2020 , 12:39:46

దాతృత్వాన్ని చాటుకుంటున్న దాతలు

దాతృత్వాన్ని చాటుకుంటున్న దాతలు

వరంగల్ రూరల్:  క‌రోనా విప‌త్తులో ఆర్థిక లోటుని సైతం అదిగ‌మిస్తూ, ప్ర‌జ‌ల‌కు నిరంత‌రంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వాల‌కు మేమున్నామంటూ అండ‌గా అనేక మంది వ్య‌క్తులు, సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. విరాళాలు అందిస్తూ త‌మ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి. తాజాగా స్పైసెస్ రంగంలో పేరున్న క‌రానీ గ్రూపు రూ.5.62 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించింది. ఇందులో సీఎం స‌హాయ నిధికి రూ. 2.11 ల‌క్ష‌లు, పీఎం కేర్స్ ఫండ్ కి రూ.3.51ల‌క్ష‌ల విరాళాన్ని అందించింది. ఈ మెత్తాన్ని రెండు వేర్వేరు చెక్కుల‌ రూపంలో క‌రానీ కంపెనీ ప్రతినిధులు ప‌ర్వ‌త‌గిరిలో ఉన్న రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు అందజేశారు. 


logo