శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 18:12:09

సీఎంఆర్ఎఫ్‌కు కారం ర‌వీంద‌ర్ రెడ్డి నెల పింఛ‌ను విరాళం

సీఎంఆర్ఎఫ్‌కు కారం ర‌వీంద‌ర్ రెడ్డి నెల పింఛ‌ను విరాళం

హైద‌రాబాద్ : న‌గరంలోని వరద బాధితుల స‌హాయం నిమిత్తం సీఎం స‌హాయ నిధికి టీఎన్జీవో కేంద్ర మాజీ అధ్య‌క్షులు త‌న‌ ఒక నెల పెన్షన్‌ను విరాళంగా అంద‌జేశారు. టీఎన్జీవో రహదారులు, భవనాల‌శాఖ యూనిట్ ఆధ్వర్యంలో టీఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షులు కారం రవిందర్ రెడ్డి, నూతన అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ కు బుధ‌వారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వారం రోజులుగా కురుస్తున్న వానలకు హైదరాబాద్‌లో జన జీవనం అతలాకుతలమైందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివ‌న్నారు. చిన్న కుటుంబాలు నీడను కోల్పోయాయి. వారంతా రోడ్డున పడ్డారు. ఇప్పటికి ఇండ్లు నీటిలో మునిగిఉన్నాయ‌న్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి సమాజంలోని పెద్దలు అందరూ స్పందించి సహాయం అందించాల‌న్నారు. సీఎం పిలుపుమేర‌కు త‌న వంతు సహాయంగా ఒక నెల పింఛను రూ.33,650 ను అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.