శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 01:53:17

యూవీసీ డిజిన్ఫెక్షన్‌ బాక్స్‌తో కరోనాకు చెక్‌

యూవీసీ డిజిన్ఫెక్షన్‌ బాక్స్‌తో కరోనాకు చెక్‌

సిద్దిపేట రూరల్‌: కరోనా వైరస్‌ అందరినీ భయపెట్టిస్తున్నది. ఇంట్లోకి తీసుకెళ్లే ఏ వస్తువుపైనా వైరస్‌ ఉండవచ్చు. అలాంటప్పుడు ఆల్ట్రా వయొలిన్‌ కిరణాల కాంతి ద్వారా వైరస్‌ను అంతం చేయవచ్చని అంటున్నాడు సిద్దిపేట యు వకుడు. సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఐటీ డిపార్ట్‌మెంట్‌లో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్న కాపర్తి భార్గవ్‌.. కేవలం రూ.600 ఖర్చుతో యూవీసీ డిజిన్ఫెక్షన్‌ బాక్స్‌ను రూపొందించాడు. యూవీసీ లైటర్‌, కనెక్టర్‌, థర్మకోల్‌ షీట్‌లను ఉపయోగించి ఈ యూవీసీ లైటర్‌ను తయారుచేశాడు. బయట నుంచి తెచ్చిన ఎలాంటి వస్తువునైనా ఈ బాక్స్‌లో పెట్టి పవర్‌ ఆన్‌ చేసి 5 నిమిషాలపాటు ఉంచితే క్రిమిరహితంగా మారుతుందని చెబుతున్నాడు.


logo