ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 17:25:52

కానుగంటి మధుకర్ మరణం బాధాకరం : మంత్రి ఎర్రబెల్లి

కానుగంటి మధుకర్ మరణం బాధాకరం : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ కానుగంటి మధుకర్ హఠాన్మరణం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత రెండు దశాబ్దాలుగా రిపోర్టర్ గా అందరికీ సుపరిచితుడైన మధుకర్  అనేక ప్రజా సమస్యలపై అవగాహనతో వార్తలు రాసేవారన్నారు. మధుకర్ మృతి పట్ల వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి భగవంతుడిని ప్రార్థించారు.


logo