దిలావర్పూర్లో వెలుగులోకి కన్నడ శాసనాలు

చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరాజు
దిలావర్పూర్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ప్రాచీన చరిత్రకు సంబంధించిన పలు శాసనాలు వెలుగులోకి వచ్చాయని చరిత్ర పరిశోధకుడు, ప్రముఖ కవి తుమ్మల దేవరాజు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. దిలావర్పూర్లో ప్రాచీన కాలానికి సంబంధించిన నాలుగు శాసనాలను గుర్తించి, తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖకు పంపించినట్లు తెలిపారు. దిలావర్పూర్ పంచాయతీ వద్ద ఒకటి, హనుమాన్ ఆలయం వద్ద మరోటి, ఇతర ప్రదేశాల్లో ఇంకో రెండు ఉన్నాయన్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద గల శాసనం కల్యాణి చాళక్యుల కాలానికి చెందినదని, దానిపై రెండు వైపులా కన్నడ లిపిలో అక్షరాలు ఉన్నట్లు చెప్పారు. ఆలయానికి భూమి దానం చేసిన దాతల పేరుగా శాసనం సూచిస్తున్నదని తెలిపారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ శాసనంలో త్రిభువనమల్లు బిరుదాంకితుడైన విక్రమాదిత్యుడు వేయించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ శాసనంపై అప్పటి దాతలైన నాగమయ్య, ఆలెయమ్మ, సుంకమయ్య పేర్లున్నాయన్నారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు