గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:29

తండ్రి కేబుల్‌ ఆపరేటర్‌..కొడుకు ఆలిండియా టాపర్‌

తండ్రి కేబుల్‌ ఆపరేటర్‌..కొడుకు ఆలిండియా టాపర్‌

  • కొడుకు ఆలిండియా టాపర్‌
  • సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 500లకు 497 మార్కులు 
  • కామారెడ్డి జిల్లా నవోదయ విద్యార్థి ప్రతిభ

నిజాంసాగర్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయ విద్యార్థి టీ సాయితేజ సత్తాచాటాడు. 500 మార్కులకుగాను 497 సాధించి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. సాయితేజ తండ్రి రవి ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లి సమీప గ్రామంలో కేబుల్‌ ఆపరేటర్‌. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట జవహర్‌ నవోదయ విద్యాలయంలోని హ్యూమానిటీస్‌ (మానవ విజ్ఞానశాస్త్రం) విభాగంలో సాయితేజ 11, 12వ తరగతి చదివాడు. 12వ తరగతి ఫలితాల్లో సాయితేజకు ఇంగ్లిష్‌లో 99, హిందీలో 100, చరిత్రలో 100, భూగోళశాస్త్రం(జాగ్రఫీ)లో 100, ఆర్థికశాస్త్రం(ఎకనామిక్స్‌)లో 98 మార్కులు సాధించాడు. ప్రతిభచాటిన సాయితేజను నిజాంసాగర్‌ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ శేఖర్‌బాబు, అధ్యాపకులు మంగళవారం అభినందించారు. మరోవైపు, సైన్స్‌ గ్రూపునకు చెందిన విద్యార్థులు ఉదయ్‌కిరణ్‌, సాయిప్రసాద్‌ 500 మార్కులకుగాను 480 మార్కులు సాధించి అచ్చంపేట నవోదయ విద్యాలయంలో ఉన్నతస్థానంలో నిలిచారని మెచ్చుకున్నారు.


logo