Telangana
- Nov 24, 2020 , 22:28:05
కామారెడ్డి సీఐ జగదీశ్ సస్పెన్షన్

నిజామాబాద్ సిటీ: కామారెడ్డి సీఐ జగదీశ్‌ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినితీ ఆరోపణలు ఎదుర్కొవడంతో ఏసీబీ అధికారులు ఈనెల 20న కామారెడ్డిలోని సీఐ జగదీశ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడంతో ఈనెల 22న జగదీశ్‌ను రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఏసీబీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు సీఐ జగదీశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఈ మేరకు నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి ఉత్తుర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
MOST READ
TRENDING