గురువారం 28 మే 2020
Telangana - May 22, 2020 , 19:03:04

కరోనా రహిత జిల్లాగా కామారెడ్డి : మంత్రి వేముల

కరోనా రహిత జిల్లాగా కామారెడ్డి : మంత్రి వేముల

కామారెడ్డి : కరోనా వైరస్‌ రహిత జిల్లాగా కామారెడ్డి మారిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి వేముల నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన నియంత్రిత వ్యవసాయ విధానం అమలు తీరుతెన్నులపై భేటీలో సమీక్షించారు. భిన్నమైన పంటల సాగు వివరాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, జాజాల సురేందర్‌, జడ్పీ చైర్‌సర్సన్‌ దఫేదార్‌ శోభ, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 3.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం 97 శాతం పూర్తయిందన్నారు. ప్రతి క్లస్టర్‌లో రూ.20 లక్షలతో రైతు వేదిక నిర్మాణానికి సీఎం నిర్ణయించారన్నారు. మక్క పంట వర్షాకాలంలో కాకుండా యాసంగిలో వేయాలన్నారు. కందులు 15 లక్షల ఎకరాల్లో పండిస్తే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.


logo