e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News టీఆర్ఎస్‌తోనే క‌మలాపూర్ మైనార్టీలు: ఎమ్మెల్యే చల్లా

టీఆర్ఎస్‌తోనే క‌మలాపూర్ మైనార్టీలు: ఎమ్మెల్యే చల్లా

టీఆర్ఎస్‌తోనే క‌మలాపూర్ మైనార్టీలు: ఎమ్మెల్యే చల్లా

వ‌రంగ‌ల్‌: క‌మ‌లాపూర్ మండ‌లంలోని మైనార్టీలు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్ర‌క‌టించార‌ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఇవాళ ఆయ‌న కమలాపూర్‌ మండలంలోని వివిధ గ్రామాల మైనార్టీ సంఘాల నాయకులతో హన్మకొండలో సమావేశం అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు ప్రాధాన్యత దక్కింద‌ని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా షాదీముబారక్ పథకం అమ‌ల్లో లేద‌ని చెప్పారు.

తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఆడబిడ్డ పెళ్లికి రూ.1,00116 అందిస్తున్న ఘ‌ణ‌త‌ సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌ని తెలిపారు. ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన సీఎం వారి అభివృద్ధికి తోడ్పడుతున్నార‌ని వెల్ల‌డించారు. మండలంలోని మైనార్టీల కుటుంబాలను ఆర్ధికంగా బలపరిచేందుకు కృషిచేస్తాన‌ని హామీ ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమల‌వుతున్నాయ‌ని చెప్పారు.

ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీకి త‌న ఆత్మ‌గౌర‌వాన్ని తాకట్టు పెట్టారని విమ‌ర్శించారు. సీఎం కేసీఆర్ ఏ విష‌యంలో తక్కువ చేశార‌ని ప్రశ్నించారు. నిన్న ఈట‌ల మాట్లాడిన మాటలకు అన్నివర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నార‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఆర్ఎస్‌తోనే క‌మలాపూర్ మైనార్టీలు: ఎమ్మెల్యే చల్లా

ట్రెండింగ్‌

Advertisement