బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 21:01:46

248 రోజుల తర్వాత రాజన్న కల్యాణకట్ట ప్రారంభం

248 రోజుల తర్వాత రాజన్న కల్యాణకట్ట ప్రారంభం

వేములవాడ కల్చరల్‌:   కరోనా లాక్‌డౌన్‌తో  వేములవాడ రాజన్న ఆలయంలో    గత మార్చి 20వ తేదీన మూతపడ్డ కల్యాణకట్ట దాదాపు 248 రోజుల తర్వాత బుధవారం మళ్లీ తెరుచుకుంది. దీంతో భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కల్యాణకట్టలో కొవిడ్‌ -19 నిబంధనల మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మాస్క్‌ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. కాగా, బుధవారం కల్యాణకట్టలో 924 మంది భక్తులు తలనీలాల మొక్కులు తీర్చుకోగా, రాజన్నకు సుమారు రూ. 9240 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.


logo