గురువారం 26 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 00:24:25

కాంగ్రెస్‌ నాయకురాలికి కల్యాణలక్ష్మి

కాంగ్రెస్‌ నాయకురాలికి కల్యాణలక్ష్మి

  • రాష్ట్రంలో పార్టీలకతీతంగా పథకాల వితరణ

సిరిసిల్ల/వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. అందుకు ఉదాహరణే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ. పార్టీలకతీతంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు చేస్తున్నది. ఈ నెల 15న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌ బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు వంగల రాజ్‌కుమార్‌ సతీమణి జలజ రెండేండ్ల క్రితం స్కూటీపై నుంచి కిందపడటంతో కాలుకు తీవ్రగాయమైంది. కరీంనగర్‌లో శస్త్రచికిత్స చేయించుకుని, సీఎంఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.46 వేలు మంజూరు చేసి ఆదుకున్నది. తాజాగా వేములవాడలోని గాంధీనగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు, మాజీ వార్డు కౌన్సిలర్‌ సుగూరి లక్ష్మి బుధవారం కల్యాణలక్ష్మి చెక్కు అందుకున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన లక్ష్మి-నాగభూషణం దంపతులు గత జూలై నెలలో తమ కూతురు హారికకు వివాహం చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి సాయం కోసం దరఖాస్తు చేసుకోగా, వారికి రూ.లక్షా 116ల విలువైన చెక్కు మంజూరుగా కాగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి బుధవారం వారికి అందజేశారు.