e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home తెలంగాణ కవలలిద్దరికీ కల్యాణలక్ష్మి

కవలలిద్దరికీ కల్యాణలక్ష్మి

కవలలిద్దరికీ కల్యాణలక్ష్మి

ధర్మపురి, జూన్‌ 19: పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో అండగా నిలుస్తుందనడానికి ఇదొక ఉదాహరణ.. ఒకే ఇంట్లో కవలలిద్దరికి సంబంధించి రెండు చెక్కులను ఒకేసారి మంజూరు చేయడంతో వారి తల్లిదండ్రుల్లో సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌కు చెందిన కుంటాల నర్సమ్మ-గంగయ్య దంపతులకు ప్రేమజ్యోతి, కృపజ్యోతి కవలలు. వీరికి ఈ ఏడాది జనవరి 6న వివాహాలు జరిపించారు. అనంతరం కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోగా ఇద్దరికీ రూ.1,00,116 చొప్పున మంజూరు కాగా.. శనివారం ఆ చెక్కులను డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి వారి తల్లి నర్సమ్మకు అందజేశారు.

సీఎం సార్‌కు రుణపడి ఉంటాం..

కల్యాణలక్ష్మి మీద భరోసాతోనే మా కవల పిల్లలకు పెళ్లిళ్లుచేశాం. మాది చాలా పేద కుటుంబం. నేను, నా భర్త పని చేసుకుంటూ పిల్లలను డిగ్రీ వరకు చదివించినం. కల్యాణలక్ష్మి ఉన్నదనే ధైర్యంతోనే ఇద్దరు కూతుళ్లకు ఒకేరోజు పెళ్లిళ్లు చేసినం. ఇద్దరికీ చెక్కులు వచ్చిన య్‌. సీఎం కేసీఆర్‌, మంత్రి కొప్పు ల ఈశ్వర్‌కు రుణపడి ఉంటాం.
కుంటాల నర్సమ్మ, తల్లి

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కవలలిద్దరికీ కల్యాణలక్ష్మి
కవలలిద్దరికీ కల్యాణలక్ష్మి
కవలలిద్దరికీ కల్యాణలక్ష్మి

ట్రెండింగ్‌

Advertisement