మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 02:13:53

పేదింటి ఆడబిడ్డకు ‘కల్యాణ’ కానుక

పేదింటి ఆడబిడ్డకు ‘కల్యాణ’ కానుక

  • చెక్కు అందజేసి అనాథకు అండగా నిలిచిన రాష్ట్ర సర్కారు
  • భావోద్వేగానికి గురైన యువతి
  • సీఎం సారుకు రుణపడి ఉంటానని కృతజ్ఞతలు

మానకొండూర్‌ రూరల్‌: పేదింటి ఆడబిడ్డకు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. తల్లిదండ్రులను కోల్పోయి మేనమామ సంరక్షణలో పెరిగి, ప్రేమ వివాహం చేసుకున్న యువతికి కల్యాణలక్ష్మి చెక్కు అందజేసి భరోసా ఇచ్చింది. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన గొల్లపల్లి స్వప్న ప్రేమ వివాహం చేసుకోగా కల్యాణ లక్ష్మి చెక్కు మంజూరైంది. మానకొండూర్‌లో శుక్రవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆ యువతికి చెక్కును అందజేశారు. చెక్కు అందుకుంటూ ఆ యువతి భావోద్వేగానికి గురైంది. ‘మేం కష్టం చేసుకుంటనే బతికేటోళ్లం. కల్యాణలక్ష్మి వస్తదో రాదో అనుకున్న. తల్లిదండ్రులు లేని నాకు సీఎం సారే పెద్ద దిక్కైండు. కల్యాణలక్ష్మి కింద లక్ష నూటపదహార్లు అందినయ్‌. చానా సంతోషంగా ఉందటూ సీఎం సారుకు, ఎమ్మెల్యే రసమయి అన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పింది.logo