శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 03:00:34

నీటమునిగిన కల్వకుర్తి మొదటి లిఫ్ట్‌

నీటమునిగిన కల్వకుర్తి మొదటి లిఫ్ట్‌

కొల్లాపూర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మొదటి లిఫ్ట్‌ మోటర్లు శుక్రవారం నీట మునిగాయి. కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు శివారులో కృష్ణానది బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా నిర్మించిన ఎంజీకేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌  పంప్‌హౌజ్‌లో సాయంత్రం మొదటి మోటర్‌ ఆన్‌ చేసిన కొద్దిసేపటికి మూడోమోటర్‌ నడిపించారు. మోటర్‌లో సాంకేతిక లోపం తలెత్తి కొద్దిసేపు మొరాయించి పేలినట్లు సమాచారం. దీంతో సర్జ్‌పూల్‌ నుంచి అకస్మాత్తుగా పంప్‌హౌజ్‌లోకి నీరు చేరడంతో ఐదుమోటర్లు మునిగిపోయాయి. క్రమంగా నదినీరు పంప్‌హౌజ్‌లోకి చేరుతూ రాత్రి 8 గంటల వరకు అండర్‌ గ్రౌండ్‌లో నుంచి మూడోఫ్లోర్‌ సైతం మునిగినట్లు సమాచారం. నీట మునిగిన పంప్‌హౌజ్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం రాత్రి పరిశీలించారు. 2015 అక్టోబర్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. logo