సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 11:30:23

కవిత గెలుపు ఖాయం: మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

కవిత గెలుపు ఖాయం: మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవితను ప్రకటించినందుకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మంత్రి ధన్యవాదాలు తెలిపారు.  

'ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు కవిత పేరును సీఎం కేసీఆర్‌ ప్రకటించడం పట్ల మేమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితను గెలిపించుకుంటాం. స్థానిక సంస్థల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. ఇందులో 532 ఓట్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవే. మిత్రపక్షం ఎంఐఎం పార్టీకి కూడా ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 140, బీజేపీకి 85 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఓట్లను బట్టి చూస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత సునాయాసంగా గెలుస్తుందని' మంత్రి పేర్కొన్నారు. 


logo