శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 13:11:09

ఎమ్మెల్సీగా క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ప్ర‌మాణ‌స్వీకారం

ఎమ్మెల్సీగా క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ప్ర‌మాణ‌స్వీకారం

హైద‌రాబాద్ : నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత గురు‌వారం మ‌ధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంట‌లకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి.. ఆమె చేత ప్రమాణం చేయించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత‌కు మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో పాటు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ నెల 9న జరి‌గిన నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప‌ఎ‌న్ని‌కల్లో 88 శాతం ఓట్లతో కవిత ఘన విజయం సాధిం‌చారు. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్య‌ర్థు‌లకు కనీసం డిపా‌జిట్లు కూడా దక్క‌లేదు. కవిత 2014 నుంచి 2019 వరకు నిజా‌మా‌బాద్‌ ఎంపీగా పని‌చే‌శారు. తెలం‌గాణ జాగృతి సంస్థను ఏర్పా‌టు‌చేసి బతు‌కమ్మ పండుగ, తెలం‌గాణ సంస్కృతిని విశ్వ‌వ్యాప్తం చేశారు.