బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 15:28:20

మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న మాజీ ఎంపీ కవిత

మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న మాజీ ఎంపీ కవిత

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్నారు. దక్షిణ భారతదేశంలో వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్న తొలి మహిళా నేత కవిత కాగా, ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలు ఇంత పెద్దఎత్తున ఫాలోవర్లను పొందడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి సైతం మాజీ ఎంపీ కవితకు ట్విట్టర్ లో ఫాలోవర్లు ఉన్నారు. 2010 సంవత్సరంలో ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని నెటిజ‌న్ల‌తో పంచుకోవ‌డ‌మే కాకుండా వివిధ అంశాల‌పై త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌డం, అవ‌స‌రార్థుల‌ అభ్య‌ర్థ‌న‌ల‌పై మాన‌వ‌తా హృద‌యంతో స్పందిస్తూ త‌క్ష‌ణ‌ స‌హాయం అందిస్తూ వ‌స్తున్నారు.


logo