శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 15:36:50

అసెంబ్లీలో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

అసెంబ్లీలో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌ : అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్‌ ఛాంబర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్‌ టి. పద్మారావు గౌడ్‌ సమక్షంలో కవిత బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కవిత కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవిత నిర్వహించిన పాత్ర చిరస్మరణీయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో కవిత చాటిచెప్పారని పేర్కొన్నారు. బతుకమ్మ ప్రత్యేకతను, బోనాల విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా కవిత కృషి చేశారని కొనియాడారు. ఈ వేడుకల్లో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


logo