మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 10:34:31

మాన‌వతే కేంద్రంగా కాళోజీ క‌విత్వాలు: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

మాన‌వతే కేంద్రంగా కాళోజీ క‌విత్వాలు: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

హైద‌రాబాద్‌: మాన‌వ‌తే కేంద్రంగా క‌విత్వాన్ని రాసి ప్ర‌పంచ వ్యాప్తం చేసిన మ‌హ‌నీడు ప్ర‌జా క‌వి కాళోజీ అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఆయ‌న నిరంత‌రం తెలంగాణ కోసం ప‌రిత‌పించార‌ని, మాన‌వీయ విలువ‌ల‌ను చాటార‌ని తెలిపారు. కాళోజీ జీవితాన్ని ఆద‌ర్శంగా తీసుకొని తెలంగాణ‌లో అనేక మంది క‌వుల‌య్యార‌ని పేర్కొన్నారు. ఇవాళ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా మంత్రి అంజలి ఘ‌‌‌టించారు. ప్ర‌జాక‌వి జ‌యంతిని రాష్ట్ర‌ ప్ర‌భుత్వం తెలంగాణ భాషా దినోత్స‌వంగా ప్ర‌క‌టించింద‌ని, ఆరోజున కాళోజీ స్మార‌క పుర‌స్కారాలు ఇస్తున్న‌ద‌ని చెప్పారు. కాళోజీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు కావడం త‌మ‌ అదృష్టంగా భావిస్తున్నామ‌న్నారు. ఆయ‌న జయంతి, వర్ధంతిలను ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో సాంస్కృతిక పునరుజ్జీవం చెంది అది తెలంగాణ అభివృద్ధికి మార్గం వేయాల‌ని ఆకాంక్షించారు.