బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 10:32:14

తెలంగాణ వైతాళికుడు కాళోజీ: మ‌ంత్రి కేటీఆర్‌

తెలంగాణ వైతాళికుడు కాళోజీ: మ‌ంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌: ప‌్ర‌జాక‌వి కాళోజీ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేశార‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భూమి పుత్రుడు, ప్ర‌జాక‌వి కా‌ళోజీ జ‌న్మ‌దినం సందర్భంగా మంత్రి ట్విట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించార‌ని అన్నారు. మన తెలంగాణ భాషను, యాసలోని మాధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటార‌ని కొనియాడారు. భాష రెండు విధాలుగా ఉంటుంద‌ని, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష అని.. పలుకుబడుల భాష కావాల‌ని చెప్పిన‌ తెలంగాణ వైతాళికుడు కాళోజీ అని అన్నారు. 


logo