శనివారం 04 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 02:22:52

మెడికల్‌, డెంటల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

మెడికల్‌, డెంటల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఈ నెల 15, 16 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రైవేట్‌ పీజీ వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. ఈ నెల 15,16 తేదీల్లో వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ నెల 15న ఉదయం ఏడు నుంచి 16వ తేదీ సాయంత్రం ఏడుగంటల వరకు ప్రాధాన్యతాక్రమంలో కళాశాలలవారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. తుది మెరిట్‌ జాబితాను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆర్మీ డెంటల్‌ కాలేజీ సీట్లను తదుపరి విడుత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. వివరాలకు  www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.


logo