సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 14:25:28

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌ : వర్షాల కారణంగా కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. సోమవారం జరగాల్సిన రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. త్వరలోనే మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. గత వారంలో సైతం కురిసిన భారీ వర్షాల కారణంగా నిర్వహించిన పరీక్షలను యూనివర్సిటీ వాయిదా వేసింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo