బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 02:34:28

మూడు నెలల్లో కాళోజీ కళాకేంద్రం

మూడు నెలల్లో కాళోజీ కళాకేంద్రం

  • శరవేగంగా సాగుతున్న పనులు 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వరంగల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళోజీ కళా కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నా యి. మూడు నెలల్లో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేశారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట హన్మకొండలోని బాలసముద్రం ప్రధాన రహదారిలో 4.25 ఎకరాల సువిశాల స్థలంలో కళా కేంద్రాన్ని నిర్మిస్తున్నా రు. నాలుగు అంతస్తుల సువిశాల భవనంలో 1,500 మంది కూర్చునేలా ఆడిటోరియం, మినీ సమావేశమందిరం, డైనింగ్‌ హాళ్లు, వీఐపీ సూట్లు ఇలా అత్యాధునిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. 


logo