సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 18:17:39

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

వరంగల్‌ అర్బన్ : భారీ వర్షాల కారణంగా కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలో బుధ, గురువారాలు నిర్వహించాల్సి ఉన్న అన్ని రాత, ప్రాక్టికల్‌ పరీక్షలను రద్దు చేసినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ డీ ప్రవీణ్‌ కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 14 బుధవారం నిర్వహించాల్సిన ఎండీ హోమియో పార్ట్‌ 1, 2, ఎండీ యునానీ పార్టు 2, ఎంపీహెచ్‌ ద్వితీయ సంవత్సరం, ఎంపీటీ చివరి సంవత్సరం, ఎంఎస్సీ నర్పింగ్‌ చివరి సంవత్సరం, బీఎన్‌వైఎస్‌ మొదటి సంవత్సరం పార్టు 2, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీఏఎంఎస్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలతో పాటుగా అక్టోబర్‌ 15 గురువారం నిర్వహించాల్సిన ఎంపీహెచ్‌ మొదటి సంవత్సరం, ఎంపీటీ మొదటి సంవత్సరం, ఎంఎస్సీ నర్సింగ్‌ మొదటి సంవత్సరం, ఎంఎస్సీ ఐప్లెడ్‌ న్యూట్రిషియన్‌ మొదటి సంవత్సరం, బీఎన్‌వైఎస్‌ ద్వితీయ సంవత్సరం పార్టు 1, బీయూఎంఎస్‌ మొదటి, తృతీయ సంవత్సరం, బీహెచ్‌ఎంఎస్‌ మొదటి, తృతీయ సంవత్సరం, బీఏఎంఎస్‌ మొదటి, తృతీయ సంవత్సర పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. వీటి నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.


logo