సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 14:38:02

కాళోజీకి సీఎం కేసీఆర్‌ ఘన నివాళి

కాళోజీకి   సీఎం కేసీఆర్‌ ఘన నివాళి

హైదరాబాద్‌: ప్రజాకవి  కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో కాళోజీ చిత్రపటానికి ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌ రావు    పూల‌మాల వేసి నివాళులర్పించారు. శాసనసభ స్పీకర్  పోచారం  శ్రీనివాసరెడ్డి, మంత్రులు,  ఎమ్మెల్యేలు కూడా  కాళోజీకి నివాళుల‌ర్పించారు. 

ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీ నారాయణరావు ఎప్పటికీ చిరస్మరణీయుడేనని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యదీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడే వారు అని కేసీఆర్‌ గుర్తు చేశారు.


తాజావార్తలు


logo