శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:40

భవిష్యత్తులో సింగూర్‌కు కాళేశ్వరం జలాలు

భవిష్యత్తులో సింగూర్‌కు కాళేశ్వరం జలాలు

  • ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డిప్రతినిధి, నమస్తే తెలం గాణ: రానున్న రోజుల్లో కాళేశ్వరం జలాలను సింగూరుకు తరలించి అక్కడి నుంచి అందోలు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోకవర్గాలకు నీటిని విడుదల చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. గురువారం మంత్రి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. అందోలు-జోగిపేట కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కాగా జోగిపేటలో ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. జహీరాబాద్‌లో నారింజ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 33 జిల్లాలు అవసరమా? అని విమర్శలు చేసిన వారు కూడా చిన్న జిల్లాలతో జరుగుతున్న అభివృద్ధి చూసి మెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్‌, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ పాల్గొన్నారు.


తాజావార్తలు


logo