e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం జలాలు : సీఎం

కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం జలాలు : సీఎం

కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం జలాలు : సీఎం

కామారెడ్డి : ఎల్లారెడ్డి, కామారెడ్డికి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, పోలీసు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు షిండే, సురేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేత, తదితరులు పాల్గొన్నారు. నూతన సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేసానని తెలిపారు. కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి తీరుతమన్నారు. త్వరలోనే ఇంజినీర్లతో గుల్‌దస్తా గెస్ట్‌హౌజ్‌లో సాగునీటి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా కామారెడ్డి, ఎల్లారెడ్డిని సస్యశ్యామలం చేసే బాధ్యత తనదన్నారు. గతంలో హామీ ఇచ్చిన మేరకు కామారెడ్డి జిల్లా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హామీ ఇస్తే నెరవేరుస్తా, హామీ ఇవ్వని పనులు కూడా చాలా చేసినట్లు వెల్లడించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం జలాలు : సీఎం
కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం జలాలు : సీఎం
కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం జలాలు : సీఎం

ట్రెండింగ్‌

Advertisement