సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 14:43:49

సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు, కాళేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం మృతి

సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు, కాళేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం మృతి

సిద్దిపేట :  కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్, సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మర వెంకటేశం కరోనాతో మృతి చెందారు. గత వారం రొజుల క్రితం హైదరాబాద్ లోని వాసవి దవాఖానలో చేరి చికిత్స పొందుతున్నారు. వీరిది దుబ్బాక ప్రాంతం. వెంకటేశంకు భార్య విజయ, నలుగురు కొడుకులు నాగభూషణం, శ్రీనివాస్, రాజేందర్, ప్రసాద్ ఉన్నారు. వెంకటేశం రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీగా, చల్లాపూర్ గ్రామ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా, రేకులకుంట మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడిగా పని చేశారు. ప్రస్తుతం కాళేశ్వర దేవస్థానం చైర్మన్ గా కొనసాగుతూ మృత్యుబారిన పడ్డారు. వెంకటేశం మృతి పట్ల పలువురు నివాళులు అర్పించారు.


logo