శనివారం 06 జూన్ 2020
Telangana - May 22, 2020 , 00:42:37

మండుటెండల్లోనూ మత్తడి

మండుటెండల్లోనూ మత్తడి

  • కాళేశ్వరం జలాలతో నిండుకుండలా పెద్ద చెరువు
  • పరిశీలించిన ఎమ్మెల్యే రసమయి  

ఇల్లంతకుంట: అన్నపూర్ణ రిజర్వాయర్‌ ద్వారా వారంక్రితం నీటిని విడుదల చేయగా కాళేశ్వరం జలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక పెద్దచెరువు నిండుకుండను తలపిస్తున్నది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జెడ్పీ వైస్‌చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి తదితరులు గురువారం చెరువును పరిశీలించారు. వానకాలానికి ముందే మత్తడి దుంకుతుండటంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తంచేస్తూ సరదాగా గడిపారు. మండలంలో 11 ఏండ్లుగా ఏ చెరువూ నిండి మత్తడి దుంకలేదని, సీఎం కేసీఆర్‌ దయవల్ల గోదారమ్మ తమ ఊళ్లకు వచ్చి మండుటెండల్లోనూ మత్తళ్లను పారిస్తున్నదని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. logo