వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను wwwkakatiya.ac.inలో చూసుకోవచ్చని తెలిపారు.
రివాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ ఫస్టియర్ రెండో సెమిస్టర్లో 76.11 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. డిగ్రీ సెకండియర్ ఫస్ట్ సెమిస్టర్లో 85.71 శాతం, రెండో సెమిస్టర్లో 82.79 శాతం, డిగ్రీ మూడో సంవత్సరం సెకండ్ సెమిస్టర్లో 85.68 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.