బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 01:35:16

లఢక్‌లోనే కాగజ్‌నగర్‌ జవాన్‌ అంత్యక్రియలు

లఢక్‌లోనే కాగజ్‌నగర్‌ జవాన్‌ అంత్యక్రియలు

కాగజ్‌నగర్‌టౌన్‌: దేశ సరిహద్దులో లఢక్‌ వద్ద ఈ నెల 17న కొండచరియలు విరిగిపడి మృతి చెందిన ఆర్మీ జవాన్‌ షాకీర్‌ హుస్సే న్‌(38) అంత్యక్రియలు మంగళవారం సైనిక లాంఛనాలతో పూర్తిచేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన షాకీర్‌ హుస్సేన్‌  లఢక్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 17న విధులు ముగించుకొ ని మరికొందరు జవాన్లతో కలిసి బేస్‌ క్యాంపునకు వెళ్తుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో షాకీర్‌ హుస్సేన్‌ మృతిచెందాడు. కాగా, 18న ఉదయం ఆర్మీ అధికారులు షాకీర్‌హుస్సేన్‌ తండ్రి షేక్‌ హుస్సేన్‌కు ఫోన్‌ చేసి.. షాకీర్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేశామనీ, అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులు రావాల్సిందిగా సూచించారు. దీంతో ఈ నెల 19న షాకీర్‌ తల్లిదండ్రులు షేక్‌ హుస్సేన్‌, జ మ్షిత్‌ సుల్తానా, భార్య నిఖత్‌ సుల్తానాతోపాటు కుటుంబ సభ్యులు శ్రీనగర్‌కు బయలుదేరారు. షాకీర్‌ హుస్సేన్‌ మృతదేహాన్ని చూసి ఆయన తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.