మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 25, 2020 , 21:55:48

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి రూ.5 లక్షలు విరాళం

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి రూ.5 లక్షలు విరాళం

వరంగల్ అర్బన్:  కరోనా వ్యాప్తి నిరోధానికి తమ వంతు బాసటగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. కరోనా బాధితుల సహాయార్థం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి  తన 2 నెలల జీతం రూ.5లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేయనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. కరోనా నివారణ కోసం జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ తన ఎంపీ నిధుల నుంచి రూ. 1.1 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. 


logo
>>>>>>